ఆంధ్రప్రదేశ్
రహదారుల భద్రతకు చర్యలు : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
04-11-2026 11:04

మురసు తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రహదారుల భద్రత, రాకపోకల పునరుద్ధరణకు రహదారులు,భవనాల శాఖ ఆధ్వర్యంలో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు, జాతీయ రహదారుల పరిధిలో మొత్తం 30 కంట్రోల్ రూమ్‌లు, సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 40 మంది సమన్వయ అధికారులను నియమించామన్నారు. 53 ప్రాంతాల్లో సిబ్బంది, యంత్రాలు, అవసరమైన సామగ్రితో సహాయక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు.. రహదారులు, వంతెనలు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
xPress24, Amaravati, November 4,