xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూవినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూ
రాజకీయాలు

రాహుల్ గాంధీ డ్రామాలు కొనసాగుతున్నాయి - కిరణ్ రిజిజు

07-10-2026 09:59
రాహుల్ గాంధీ డ్రామాలు కొనసాగుతున్నాయి - కిరణ్ రిజిజు
రాజ్యాంగ వ్యవస్థలను రాహుల్ గాంధీ నిత్యం లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు లభించదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
xPress24, Hyderabad, October 6, కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు ఇండియా కూటమి నేతలు మార్చ్ నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలను నిత్యం లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు లభించదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సాగిస్తున్న రోజువారీ డ్రామాలను ఇకనైనా ఆపాలని రిజిజు చెప్పారు. 2014 నుంచి ఈ డ్రామాలు నిరంతరం కొనసాగుతున్నాయని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేస్తేనే ప్రజాతీర్పు లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఎన్నికల సంఘాన్ని విమర్శించడం, సుప్రీంకోర్టు క్షమాపణ కోరితే కోర్టుపైనే దాడి చేయడం సరికాదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, బీజేపీ కార్యకర్తలను చూసి కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలని రిజిజు సూచించారు. సమాజం కోసం, దేశం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న బీజేపీ శ్రేణుల మాదిరిగా ప్రజా సేవపై దృష్టి పెట్టాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో దేశాన్ని ఐదు దశాబ్దాలకు పైగా పాలించిందని, అత్యవసర పరిస్థితిని విధించి రాజ్యాంగ ప్రవేశికను కూడా మార్చేశారని రిజిజు అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.