బిజినెస్
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
27-10-2026 09:46

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మెటల్, ఫార్మా రంగాల మద్దతుతో సెన్సెక్స్ 482 పాయింట్లు పెరిగి 73,606 వద్ద, నిఫ్టీ 22,753 పాయింట్ల వద్ద ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలోనూ కొనుగోళ్ల ఉత్సాహం కనిపించగా, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్ రాణించాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టాలను చవిచూశాయి.
xPress24, mumbai, October 26,
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల నడుమ లాభాలతో ముగిశాయి. మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో పాటు బ్రాడర్ మార్కెట్లు ఇంట్రాడే కనిష్టాల నుంచి కోలుకోవడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 482 పాయింట్లు పెరిగి 73,606.75 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 0.68 శాతం లాభపడి 22,753.20 పాయింట్ల వద్ద ముగిసింది.
లాభాల్లో మెటల్, ఫార్మా షేర్లు
నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.2 శాతం ఎగబాకగా, నిఫ్టీ ఫార్మా 1.67 శాతం, హెల్త్‌కేర్ రంగాలు బలమైన లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీఎస్ఈ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ లాభపడగా, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ రాణించగా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి.