xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
తెలంగాణ

విజృంభిస్తున్న భారత బౌలర్లు- లంచ్ సమయానికి కివీస్ నాలుగు వికెట్లు డౌన్

19-11-2026 09:51
విజృంభిస్తున్న భారత బౌలర్లు- లంచ్ సమయానికి కివీస్ నాలుగు వికెట్లు డౌన్
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. లంచ్ సమయానికి కివీస్ 60-4 స్కోర్ తో నిలిచింది.
xPress24, Hyderabad, November 19, వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికే మన బౌలర్లు నాలుగు వికెట్లు కూల్చి పైచేయి సాధించారు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి న్యూజిలాండ్ 23 ఓవర్లలో 60-4 స్కోర్ తో నిలిచింది. క్రీజులో టామ్ బ్లండెల్ (5), హెన్రీ నికోల్స్ (29) ఉన్నారు. టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ మూడో బంతికే వికెట్ తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.  బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి  టామ్ లాథమ్ దగ్గర సమాధానం లేకపోయింది. అతడు క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే లాథమ్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్ రెండో బంతికి అన్షుల్ కంబోజ్ సంధించిన ఫుల్ లెంగ్త్ బంతికి  డెవాన్ కాన్వే  క్యాచౌట్ అయ్యాడు.  ఇక  భారీ అంచనాలతో బరిలోకి దిగిన రచిన్ రవీంద్ర (15)ను ఆకాష్ దీప్ ఔట్ చేశాడు. 50 బంతులు ఎదుర్కొని వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన రచిన్ ను ఆకాష్  క్యాచౌట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ (1)ను బుమ్రా వెనక్కి పంపించాడు. దీంతో లంచ్ కు ముందే కివీస్ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.