xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లుసింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

11-11-2026 09:31
విజయనగరం జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ బి. శాంతి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామారావు సూచించారు.
xPress24, Vizianagaram, November 10, విజయనగరం, నవంబర్ 10: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ బి. శాంతి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామారావు సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించి కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం రెండో సెషన్‌లో వారు మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని శిక్షకులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాది జిల్లాలో సుమారు 4.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో సేవలందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.