ఆంధ్రప్రదేశ్
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం
24-11-2026 15:45

విజయనగరం జిల్లాలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా భోగాపురం మండలం సుందరపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కే.పవన్ కల్యాణ్, రావణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణ సమయంలో వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని మంత్రి సూచించారు.
xPress24, Vizayanagaram, November 24,