ఆంధ్రప్రదేశ్
విజయవాడ డివిజన్‌లో జనజాతీయ గౌరవ దివస్ వేడుకలు
11-11-2026 09:36

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వే డివిజన్‌లో జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, దేశ స్వాతంత్ర్య పోరాటంలో వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమంలో విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పి.ఈ. ఎడ్విన్ మాట్లాడుతూ, భగవాన్ బిర్సా ముండా వంటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి, వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
xPress24, Vijayawada, November 11,