ఆంధ్రప్రదేశ్
విజయవాడ రూరల్‌లో ప్రారంభమైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
05-11-2026 12:15
విజయవాడ రూరల్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
xPress24, Vijayawada, November 5,
విజయవాడ రూరల్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 16 జడ్పీటీసీ స్థానాలు, 280 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో 4 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 276 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
16 జడ్పీటీసీ స్థానాలకు 55 మంది అభ్యర్థులు, 276 ఎంపీటీసీ స్థానాలకు 631 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,35,515 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 992 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.