xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఅంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ

విద్యా రంగానికి ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం: మేయర్ కొలగాని

12-11-2026 12:23
కరీంనగర్ నగరపాలక సంస్థలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ విద్యాభివృద్ధి, యూజీసీ ఏర్పాటులో ఆజాద్ కీలక పాత్ర పోషించారని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.
xPress24, Karimnagar, November 12, దేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ మంత్రివర్గంలో తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి దేశ విద్యాభివృద్ధికి ఆజాద్ ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. జాతీయ విద్యా దినోత్సవం ఆజాద్ విద్యా రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషదాయకమని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా పోరాడటంతో పాటు ఆనాడు దేశ విభజనను ఆజాద్ బలంగా వ్యతిరేకించారని తెలిపారు. ఉచిత విద్య, యూజీసీ ఏర్పాటులో కీలక పాత్ర 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య అందేందుకు ఆజాద్ ఎంతో కృషి చేశారని మేయర్ వివరించారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్యాభివృద్ధితో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు, ముస్లిం నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బైట్ - కొలగాని శ్రీనివాస్, మేయర్, కరీంనగర్ నగరపాలక సంస్థ

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.