xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
తెలంగాణ

విద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత

05-11-2026 15:49
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, విద్యుత్ కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని టిఆర్ఎస్ (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
xPress24, Hyderabad, November 5, హైదరాబాద్‌లోని ఖానామెట్, అయ్యప్ప సొసైటీ పరిధిలో గురుకుల ట్రస్ట్ బోర్డుకు కేటాయించిన 150 ఎకరాల భూముల్లో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖానామెట్‌లో ఏకంగా 500 నుండి 700 వరకు అక్రమ భవనాలు వెలిశాయని, వీటి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విమర్శించారు. గురుకుల భూముల్లో జరిగిన ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం నెలరోజుల వ్యవధిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలపై గూగుల్ మ్యాప్‌తో సహా వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను ఇంటి యజమానులు బెదిరిస్తున్నారని కవిత తెలిపారు. మా వెనుక ప్రభుత్వం ఉంది అంటూ మీడియాను సైతం భయపెడుతున్నారని, కాంగ్రెస్ నడుపుతున్నది ప్రభుత్వమా? లేక రౌడీ రాజ్యమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సోదరులే దగ్గరుండి ఇటువంటి అక్రమ పర్మిషన్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. మంథనిలో నిరుపేదల ఇళ్లను అర్థరాత్రి కూల్చివేసిన ప్రభుత్వం, హైదరాబాద్‌లో ఇంత పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఎందుకు ఆపడం లేదని నిలదీశారు. అయ్యప్ప సొసైటీ అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేసిన కవిత... రాష్ట్రంలో ఆర్టీఐ వ్యవస్థ ఒక జోక్‌గా మారిందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఖానామెట్‌లో సమగ్ర సర్వే నిర్వహించి, అనుమతులు లేని, ఫైర్ సేఫ్టీ లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనపై కవిత స్పందిస్తూ... రాష్ట్రంలో 320 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే ఆయన కేంద్రం తరఫున సాయం చేయడం మానేసి కేవలం రాజకీయం మాట్లాడి వెళ్లారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నీటి లభ్యతపై ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రి తుమ్మల మరో మాట చెబుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆమె, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మహిళలు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.