ఆంధ్రప్రదేశ్
విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
24-10-2026 09:37
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంలోని రుస్తుంబాద మున్సిపల్ పార్క్లో ఉన్న నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు.
xPress24, Machilipatnam, October 23,
కృష్ణాజిల్లా, మచిలీపట్నం | అక్టోబర్ 23, 2026 :
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంలోని రుస్తుంబాద మున్సిపల్ పార్క్లో ఉన్న నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో కలిసి కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు.
పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందిస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, భోజన సమయంలో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే విషయాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించిన రికార్డులను, విద్యార్థినులకు అందిస్తున్న భోజన మెనూను పరిశీలించారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్న తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.