xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనేబాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనే
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

26-11-2026 14:25
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మించనున్న బహుళ ప్రయోజన భవనానికి శంకుస్థాపన చేశారు.
xPress24, Mahabubnager, November 26, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బహుళ ప్రయోజన భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కొత్త భవనంలో తరగతి గదులతో పాటు కంప్యూటర్ లెర్నింగ్ సెంటర్, ప్రయోగశాల, గ్రంథాలయం వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి మెరుగైన విద్యా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు అవసరమైన బోధనా సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. విద్యా వాలంటీర్ల వ్యవస్థ మంచి ఫలితాలనిస్తోందని, గత ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారిలో సుమారు 150 మంది వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందడం అభినందనీయమన్నారు. పదో తరగతి విద్యార్థులు సెల్‌ఫోన్లు, రీల్స్‌కు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు... బైట్:  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.