xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
తెలంగాణ

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

13-11-2026 11:59
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవడంలో పుస్తక పఠనం ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. విద్యావిధానంలో నూతన మార్పులు తీసుకువస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
xPress24, Bhadradri-Kothagudem, November 13, విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవడంలో పుస్తక పఠనం ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. విద్యావిధానంలో నూతన మార్పులు తీసుకువస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల  ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏడు పాఠశాలలకు లైబ్రరీలు మంజూరయ్యాయి. దీనిలో భాగంగానే భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నూతనంగా మంజూరైన లైబ్రరీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థి దశ నుంచే పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవాలని, చక్కటి పరిజ్ఞానంతో భవిష్యత్తులో తమ కాళ్లపై తాము నిలబడుతూ.. ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో గొప్ప శిఖరాలను అధిరోహించాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సత్సంకల్పంతోనే ప్రభుత్వం పాఠశాలల్లో ప్రత్యేక నిధులతో లైబ్రరీలను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటూ, మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బైట్... తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.