ఆంధ్రప్రదేశ్
వనపర్తి నియోజకవర్గానికి కొత్తగా 5,000 పింఛన్ల మంజూరు: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
17-11-2026 11:10
వనపర్తి నియోజకవర్గానికి కొత్తగా 5,000 పింఛన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శ్రీరంగాపూర్, పెబ్బేరు, వనపర్తి పట్టణంలో సాట్ ఛైర్మన్ శివసేనా రెడ్డితో కలిసి ఆయన పింఛన్ పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందుతాయని వెల్లడించారు.
xPress24, WANAPARTHY-509103, November 17,
వనపర్తి నియోజకవర్గానికి నూతనంగా ఐదు వేల పింఛన్లు మంజూరు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని శ్రీరంగాపూర్ మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పెబ్బేరు, వనపర్తి రూరల్ మండలం, వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్త పింఛన్లతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్) ఛైర్మన్ శివసేనా రెడ్డి కూడా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు, స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ నెల 19న సీఎం చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ
నియోజకవర్గంలో కొత్తగా వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు కలిపి మొత్తం 5,000 మందికి పింఛన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చేందుకు ఇచ్చిన హామీలతో పాటు చెప్పని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ నూతన పింఛన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లబ్ధిదారులకు అందుతాయని చెప్పారు. పెద్ద మొత్తంలో పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు.
బైట్స్
తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి
శివసేనా రెడ్డి, ఛైర్మన్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్)