xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
తెలంగాణ

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావు

30-10-2026 14:48
ఢిల్లీ ర్యాలీపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాజ్యాంగ వ్యవస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
xPress24, Hyderabad, October 30, ఢిల్లీ ర్యాలీకి వెళ్లే కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలను ఎవరూ అడ్డుకోవడం లేదని, వారు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందంటూ స్పష్టం చేశారు. సభకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలపై నిరాధార ఆరోపణలు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన అత్యంత పారదర్శకంగా జరిగిందని, స్వయంగా కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ మంత్రే ఓట్ల తొలగింపు ఏమీ జరగలేదని అంగీకరించారని రామచందర్ రావు గుర్తుచేశారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి అత్యున్నత రాజ్యాంగబద్ధ వ్యవస్థలపైనా కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో గందరగోళానికి కుట్ర అర్థం లేని అంశాలను తెరపైకి తెస్తూ ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడించారు. బైట్ - రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.