xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
జాతీయం

వ్యవసాయాన్ని ఆధునీకరిస్తేనే 'వికసిత్ భారత్' సాధ్యం: ప్రధాని మోదీ

13-11-2026 11:59
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించకుండా, సాగును స్మార్ట్‌గా మార్చకుండా... 'వికసిత్ భారత్' నిర్మాణం అసాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
xPress24, Delhi, November 13, వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించకుండా, సాగును స్మార్ట్‌గా మార్చకుండా... 'వికసిత్ భారత్' నిర్మాణం అసాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం దేశ ప్రగతికి, సంస్కృతికి, సామాజిక జీవితానికి కేంద్ర బిందువు అని ఆయన అభివర్ణించారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పండుగ సీజన్‌ను వ్యవసాయ సంప్రదాయాలతో ముడిపెట్టారు. భారత్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ... వ్యవసాయం దేశ జీవన విధానంతో ముడిపడి ఉందని అన్నారు. ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసిన మోదీ, వికసిత్​ భారత్​ నిర్మాణానికి గుర్తించిన ఏడు ప్రధాన బలాల్లో వ్యవసాయం కూడా ఒకటని అన్నారు. గత దశాబ్దంలో భారతదేశ వ్యవసాయ వృద్ధి రేటు నాలుగు శాతానికి పైగా ఉందని, స్వాతంత్ర్యం తర్వాత దేశం ఇంతటి వృద్ధిని సాధించిన మొదటి దశాబ్దం ఇదేనని ఆయన అభివర్ణించారు. ప్రతి ఏటా 4 లక్షల కోట్లకు పైగా విలువైన వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోందని మోదీ పేర్కొన్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.