ఆంధ్రప్రదేశ్
వరద బాధిత కుటుంబాలను పరామర్శించిన జేసీ కె.ఆర్. కల్పశ్రీ
10-11-2026 09:55

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పర్యటించి రేషన్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
xPress24, Thadepalligudem, November 9,
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పర్యటించి రేషన్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణంలోని నిల్వలను, లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీ జరుగుతున్న తీరును తనిఖీ చేశారు.
అనంతరం యర్రకాలువ వరద నీటితో ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించారు. వరద బాధిత కుటుంబాలతో మాట్లాడి, వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు.