ఆంధ్రప్రదేశ్
వరదల అనంతరం ప్రజారోగ్యం, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
30-10-2026 09:50

వరదల అనంతరం ప్రజారోగ్య పరిరక్షణకు, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 29,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 29: వరదల అనంతరం ప్రజారోగ్య పరిరక్షణకు, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. గురువారం సాలూరు మండలం మామిడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఆమె తనిఖీ చేశారు.
వరదల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన సమస్యలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన పరిసరాలు, తగిన పారిశుద్ధ్య వసతులు కల్పించాలని ఆదేశించారు. వరదల అనంతరం తలెత్తే ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెవెన్యూ, వైద్యారోగ్య, విద్యాశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.