జాతీయం
వేవ్స్ ఫిల్మ్ బజార్ ఫలితాలు
26-11-2026 12:12

గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం -ఇఫీ లో వేవ్స్ ఫిల్మ్ బజార్ ఫలితాలను ప్రకటించారు.గోవాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రభాత్ ఈ వివరాలు వెల్లడించారు. వేవ్స్ ఫిల్మ్ బజార్లో 54 దేశాలకు చెందిన 2 వేల 288 మంది ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో 471 మంది కొనుగోలుదారులు ఉన్నారని, ఈ ఏడాది సుమారు 220 బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు జరిగాయని పేర్కొన్నారు.మరోవైపు పనాజీలో నిర్వహించిన ఇఫీపరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల శకటాలు, జానపద కళారూపాల ప్రదర్శనలతో గోవా సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పారు. ఉత్సవంలో ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్. చిత్ర ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని దిగ్గజ గాయనీమణులు లతా మంగేష్కర్, ఆశా భోస్లే, ఎస్. జానకిలకు సంగీత నివాళులర్పించారు.
xPress24, Panaji, November 26,