xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుసాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్

విశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు

11-11-2026 14:31
విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రేపటి నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
xPress24, Visakhapatanam, November 11, విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రేపటి నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ – ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించనున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నెల 13వ తేదీన భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ చేతుల మీదుగా సదస్సు ముగింపు కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం, వ్యవసాయం, ఆహార భద్రత, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, స్వచ్ఛ ఇంధనం తదితర కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలు, వివిధ రంగాల్లో సహకారంపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.