ఆంధ్రప్రదేశ్
విశాఖలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
07-11-2026 10:01

ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
xPress24, Visakhapatanam, November 6,
విశాఖపట్నం: ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్.ఎస్. రావత్ మాట్లాడుతూ.. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సమావేశంలో విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీఈడీబీ సీఈవో సాన్మోహన్, ఏపీఐసీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్, సెర్ప్ సీఈవో కరుణ, జీసీసీ ఎండీ శోభిక, విశాఖ జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీ-1 మణికంఠ చందోలు తదితర అధికారులు పాల్గొన్నారు.