తెలంగాణ
శాంతిభద్రతల పరిరక్షణతో నక్సలిజం కార్యకలాపాలు అదుపులోకి వచ్చాయి: డీజీపీ సీవీ ఆనంద్
23-10-2026 15:05
దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ సదస్సులో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు. గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ నిఘాతో నక్సలిజం అణచివేయబడిందని, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
xPress24, Hyderabad, October 23,
రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసింగ్ ద్వారా శాంతిభద్రతలను పటిష్టం చేయడంతో పాటు తీవ్రవాదం, నక్సలిజం కార్యకలాపాలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని తెలంగాణ డిజిపి సీవీ ఆనంద్ పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ విభాగం సాధించిన పలు కీలక విజయాలను వివరించారు.
తగ్గుముఖం పట్టిన నక్సలిజం
ఎలైట్ ఫోర్స్ గ్రేహౌండ్స్‌తో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ నిరంతర నిఘా, పక్కా కార్యాచరణ కారణంగా రాష్ట్రంలో నక్సలిజం కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని డీజీపీ తెలిపారు. తీవ్రవాద కదలికలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల కట్టడి
మాదకద్రవ్యాల ముప్పును అరికట్టేందుకు 2023లో ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. సరిహద్దులు దాటి విస్తరిస్తున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ సమర్థవంతమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
బైట్ - సివి ఆనంద్, తెలంగాణ డిజిపి