తెలంగాణ
శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
20-11-2026 11:55
శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే నవంబర్ 25 నుంచి జనవరి నెలాఖరు వరకు 64 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ప్రధాన మార్గాల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
xPress24, HYDERABAD, November 20,
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నవంబర్ 25 నుంచి జనవరి నెలాఖరు వరకు 64 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చర్లపల్లి, నాంపల్లి తదితర స్టేషన్ల మీదుగా ఈ రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. భక్తుల డిమాండ్‌ను బట్టి రాబోయే 2, 3 రోజుల్లో మరిన్ని రైళ్లను ప్రకటించే అవకాశం ఉందన్నారు. గత ఏడాది 75 నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపగా.. ఈసారి ఆ సంఖ్య 100కు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రైళ్ల ఏర్పాటు
తెలంగాణలోని అన్ని ప్రాంతాల భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు సీపీఆర్వో తెలిపారు. ఉత్తర తెలంగాణలో కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం ప్రాంతాలతో పాటు నాందేడ్ నుంచి నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ మీదుగా వెళ్లే మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వికారాబాద్, నల్గొండ, కాజీపేట, దోర్నకల్ ప్రాంతాలను కలుపుతూ కూడా రైళ్లను నడపనున్నట్లు స్పష్టం చేశారు.
బైట్ - శ్రీధర్, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో