xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఆదిలాబాద్‌లో లాభసాటిగా టమాట సాగుటీజీఎస్ఆర్టీసీ సరికొత్త అడుగు: 'ఐ-అలెర్ట్' టెక్నాలజీతో రూ. 36 కోట్ల డీజిల్ ఆదా!భారత్-నేపాల్ మధ్య అనుసంధానతకు కొత్త అడుగు.. నేడు 'సరయూ-కమల ఎక్స్‌ప్రెస్' ప్రారంభంకేంద్ర ఆరోగ్య శాఖ బృందంరాష్ట్రానికి ఆర్థిక సాయంఇఫీ ‘పేజ్ సే పిచ్ తక్’ కార్యక్రమంఆదిలాబాద్‌లో లాభసాటిగా టమాట సాగుటీజీఎస్ఆర్టీసీ సరికొత్త అడుగు: 'ఐ-అలెర్ట్' టెక్నాలజీతో రూ. 36 కోట్ల డీజిల్ ఆదా!భారత్-నేపాల్ మధ్య అనుసంధానతకు కొత్త అడుగు.. నేడు 'సరయూ-కమల ఎక్స్‌ప్రెస్' ప్రారంభంకేంద్ర ఆరోగ్య శాఖ బృందంరాష్ట్రానికి ఆర్థిక సాయంఇఫీ ‘పేజ్ సే పిచ్ తక్’ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్

శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ బాధ్యతల స్వీకరణ

21-11-2026 09:44
శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ బాధ్యతల స్వీకరణ
శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్, వైస్ చైర్మన్‌గా దాసరి సునేత్ర ప్రమాణ స్వీకారం చేశారు.
xPress24, Puttaparthi, November 20, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్, వైస్ చైర్మన్‌గా దాసరి సునేత్ర ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని పరిటాల శ్రీరామ్ కైవసం చేసుకోగా, ఆయనకు 22 మంది జడ్పీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు. వైస్ చైర్మన్‌గా ఎన్నికైన దాసరి సునేత్రకు కూడా జడ్పీటీసీ సభ్యుల మద్దతు లభించడంతో జిల్లా పరిషత్‌లో నూతన నాయకత్వం బాధ్యతలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పార్టీ నేతలు హాజరయ్యారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు ఆకాంక్షించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.