క్రీడలు
శ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనే
26-11-2026 14:26

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇవాళ జరిగే తొలి సెమీఫైనల్లో శ్రీలంక ఎ జట్టును భారత్ ఎ ఢీకొంటుంది.
xPress24, Hyderabad, November 26,
2026 రైజింగ్‌స్టార్స్ ఆసియా కప్‌లో భారత్ - ఎ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం జరగనున్న సెమీఫైనల్లో శ్రీలంక ఎ తో తలపడనుంది. ఈ క్రమంలో గత మ్యాచ్ లో యూఏఈపై మెరుపు డబుల్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లున్నాయి. ఈ యువ బ్యాటర్ మరోసారి బ్యాటుతో చెలరేగితే భారత్ కు భారీ స్కోర్ ఖాయం. అతడితోపాటు అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, రింకు సింగ్ పుంజుకోవాల్సి ఉంది. కెప్టెన్ తిలక్ వర్మ పాకిస్థాన్ పై సెంచరీ సాధించినా అతడి స్థాయి బ్యాటింగ్ కాదు. అందుకే తిలక్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్ తో మెరవాల్సివుంది. పేసర్లు హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు చెరో 7 వికెట్లు పడగొట్టారు. వాళ్లు అదే నిలకడతో ఆడాలని జట్టు కోరుకుంటోంది.
మరోవైపు శ్రీలంక కూడా బలంగానే ఉంది. ఈ టోర్నీలో ఆ జట్టు అజేయంగా సెమీఫైనల్ కు చేరుకుంది. నిశాన్ మదుశంక, కెప్టెన్ పవర్ రత్నాయకె, లసిత్ క్రూస్పులె బ్యాటింగ్ లో లంకకు అతిపెద్ద బలం. వీళ్లను కట్టడి చేయగలిగితే.. భారత్ కు తిరుగుండదు. ఈ క్రమంలో శ్రీలంక ఎతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఈ టోర్నీలో ఇంకో సెమీఫైనల్ రేపు జరగనుంది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఏ జట్టుతో బంగ్లాదేశ్ ఏ తలపడనుంది.