xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!
తెలంగాణ

శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

23-10-2026 14:15
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా తిరిగి ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న 109 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
xPress24, Hyderabad, October 23, హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 5 నిమిషాల వ్యవధిలోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 5 నిమిషాల్లోనే సాంకేతిక లోపం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రన్‌వే నుంచి గాల్లోకి ఎగిరిన 5 నిమిషాల్లోనే సాంకేతిక లోపాన్ని గమనించిన పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగాన్ని అప్రమత్తం చేశారు. 109 మంది ప్రయాణికులు సురక్షితం పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు రన్‌వేపై తక్షణమే భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దింపారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 109 మంది ప్రయాణికులు ఉండగా, అందరూ క్షేమంగా బయటపడ్డారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.