ఆంధ్రప్రదేశ్
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు
11-11-2026 09:53

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సదస్సు ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా వేదిక వద్ద చేపడుతున్న మౌలిక సదుపాయాలు, అతిథులకు కల్పించాల్సిన వసతులు, రవాణా, పార్కింగ్, భద్రత, పారిశుధ్య ఏర్పాట్లను సమీక్షించారు.
xPress24, Visakhapatnam, November 11,