తెలంగాణ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
07-11-2026 12:45
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 71 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు.
xPress24, Hyderabad, November 7,
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్టేషన్ పునర్నిర్మాణ పనుల వివరాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇప్పటి వరకు 71శాతం పనులు పూర్తయినట్టు వెల్లడించారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ ఆధునిక ప్రమాణాలతో సిద్ధం అవుతోందన్నారు. రోజూ దాదాపు 180 రైళ్లు, 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్దారణ పనులు పూర్తి చేసుకొని...త్వరలోనే ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. 714.73 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ కేటాయించిందన్నారు.