xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుసాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాక

11-11-2026 11:18
3వ సింగపూర్‌–ఆంధ్రప్రదేశ్‌ జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్‌ మంత్రి గాన్‌ సియోవ్‌ హువాంగ్‌ బుధవారం ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
xPress24, Gannavaram, November 11, విజయవాడ: 3వ సింగపూర్‌–ఆంధ్రప్రదేశ్‌ జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్‌ మంత్రి గాన్‌ సియోవ్‌ హువాంగ్‌ బుధవారం ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఆమె విజయవాడకు బయలుదేరి వెళ్లారు. అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు రాష్ట్రంలో చేపట్టనున్న ఇతర కీలక ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాల పురోగతిని సమీక్షించేందుకు ఈ ప్రత్యేక కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌ మంత్రి నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం అనంతరం మంత్రి నారా లోకేశ్‌తో కలిసి సింగపూర్‌ బృందం సీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లనుంది. అక్కడ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి లోకేశ్‌, సింగపూర్‌ ప్రతినిధి బృందం రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజధానిలో నిర్మాణంలో ఉన్న పలు కీలక ప్రాజెక్టులను వారు పరిశీలించనున్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.