తెలంగాణ
సింగరేణి అధికారులకు తెలంగాణ ప్రభుత్వ దసరా కానుక
21-10-2026 09:30

సింగరేణి సంస్థలోని అధికారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందిస్తూ దసరా కానుకను ప్రకటించింది. కోల్ ఇండియా తరహాలో వేతనాల పెంపును వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
xPress24, hyderabad, October 20,
సింగరేణి సంస్థలోని అధికారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందిస్తూ దసరా కానుకను ప్రకటించింది. కోల్ ఇండియా తరహాలో వేతనాల పెంపును వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల సింగరేణిలోని ఎగ్జిక్యూటివ్ కేడర్ 1 నుంచి 7 వరకు ఉన్న సుమారు 1800 మంది అధికారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచే సవరించిన ఆర్థిక ప్రయోజనాలు వర్తించేలా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సింగరేణి అధికారుల సంఘం గతంలో చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీని నెరవేర్చారని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ అభివృద్ధికి, బొగ్గు ఉత్పత్తి పెంపునకు ఎగ్జిక్యూటివ్ కేడర్ అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ పూట వేతనాల పెంపుపై ఉత్తర్వులు వెలువడటంతో సింగరేణి అధికారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.