xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తంవాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తం
తెలంగాణ

సింగరేణి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

26-10-2026 09:19
సింగరేణి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసి, మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థకు చెందిన 66 మంది జనరల్ మేనేజర్లతో ఆయన ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఉత్పాదకత పెంపుపై అధికారులతో చర్చించారు. బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు, ఉత్పత్తి చేసిన బొగ్గును వేగంగా గమ్యస్థానాలకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్లకు సూచించారు. సంస్థ సామర్థ్యాన్ని మరింత పెంచి, కార్యాచరణను మెరుగుపరచడం ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
xPress24, Hyderabad, October 26, సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసి, మరింత  అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థకు చెందిన 66 మంది జనరల్ మేనేజర్లతో ఆయన ఆదివారం  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఉత్పాదకత పెంపుపై అధికారులతో చర్చించారు. బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు, ఉత్పత్తి చేసిన బొగ్గును వేగంగా గమ్యస్థానాలకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్లకు సూచించారు. సంస్థ సామర్థ్యాన్ని మరింత పెంచి, కార్యాచరణను మెరుగుపరచడం ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.