ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలు
26-11-2026 12:09

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో మిగిలిపోయిన నాలుగు నగరపాలక సంస్థలతో పాటు 19 పురపాలక, నగర పంచాయతీల్లో గురువారం పోలింగ్ జరగనుంది. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలో మేయర్ పదవుల కోసం 36 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నాలుగు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 11 లక్షల 44 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 12 వేల మంది సిబ్బందిని నియమించారు. ఇక 19 పురపాలక, నగర పంచాయతీల్లో ఛైర్మన్ పదవుల కోసం 134 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 30న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
xPress24, Amaravati, November 26,