ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పరిశీలన
21-10-2026 09:30

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మొత్తం 3 వేల 910 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మేయర్, చైర్మన్, చైర్‌పర్సన్ పదవులకు 1,213 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 22 వేల 806 నామినేషన్లు చెల్లుబాటైనట్లు వెల్లడించారు. కార్పొరేషన్లలో 286 మేయర్, 7 వేల 610 వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదం పొందాయని చెప్పారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 927 చైర్‌పర్సన్, 15వేల 196 వార్డు సభ్యుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు తెలిపారు.
xPress24, Amaravathi, October 20,