ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
31-10-2026 12:05

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, ఎన్నికల పరిశీలకులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతలు, ఫిర్యాదులపై ఆయన సమీక్షించారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత కల్పించాలని, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సుల భద్రతలో ఎలాంటి లోపాలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
xPress24, Vijayawada, October 31,