తెలంగాణ
సైబర్ నేర సమన్వయ బృంద సమావేశం
04-11-2026 10:51

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సమన్వయంతో హైదరాబాద్‌లో జాయింట్ సైబర్ నేర సమన్వయ బృంద సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 13 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు వ్యవస్థీకృత పరిశ్రమగా మారాయని అన్నారు. నేరం జరిగిన తర్వాత నగదు రికవరీ చేయడం కంటే, అసలు నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు., సైబర్ నేరాలపై రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ సహకారం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు .
xPress24, Hyderabad, November 4,