xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
ఆంధ్రప్రదేశ్

సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదిక

26-11-2026 17:15
సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదిక
సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికగా నిలిచిందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ప్రజలకు అందించిన నవంబర్ 26వ తేదీ చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు.
xPress24, Ongole, November 26, ఒంగోలు: అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికగా నిలిచిందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ప్రజలకు అందించిన నవంబర్ 26వ తేదీ చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా గురువారం ఒంగోలు పట్టణంలోని హెచ్‌సీఎం జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ పి. రాజాబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ పాలన సజావుగా సాగేందుకు రాజ్యాంగం అవసరమని భావించి రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారని తెలిపారు. సభలోని సభ్యులందరి కృషితో రాజ్యాంగ రూపకల్పన జరిగిందన్నారు. ఈ బృహత్తర బాధ్యతను మేధావి, న్యాయకోవిదుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు అప్పగించారని పేర్కొన్నారు. అంబేద్కర్ పలు దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారత ప్రజలందరికీ సమన్యాయం జరిగేలా ఆర్థిక స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం వంటి హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారని వివరించారు. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని నేడు వివిధ దేశాలు సైతం కొనియాడుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలెక్టర్ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.