ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి: జిల్లా ఎన్నికల పరిశీలకులు సదా భార్గవి
30-10-2026 16:54

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు సదా భార్గవి ఆదేశించారు.
xPress24, Nellore, October 30,
నెల్లూరు:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు సదా భార్గవి ఆదేశించారు.
ఈ మేరకు నెల్లూరులోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఓటర్లందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.