xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
తెలంగాణ

సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

31-10-2026 12:51
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ.. పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి రన్ ను ప్రారంభించారు.
xPress24, SURYAPET, October 31, సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఐక్యత రన్ లో యువత, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. ర్యాలీ అనంతరం యువతను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శమని అన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఎంతగానో సేవ చేసిన గొప్ప వ్యక్తి అయినటువంటి సర్దార్ పటేల్‌ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని సూచించారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం పట్ల యువత జాగ్రత్తగా ఉంటూ, ఉక్కు సంకల్పంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాలని, నేటి యువత దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని ఎస్పీ పిలుపునిచ్చారు. బైట్: కె. నరసింహ, సూర్యాపేట జిల్లా ఎస్పీ

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.