xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆంధ్రప్రదేశ్

సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

30-10-2026 14:30
దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అన్నారు.
xPress24, Ongole, October 30, ప్రకాశం జిల్లా , 30 అక్టోబర్  2026 : దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన త్యాగాలు, దేశ ఐక్యతకు చేసిన కృషిని స్మరించుకుంటూ ఐక్యత పరుగును నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఎస్పీ జెండా ఊపి ఐక్యత పరుగును ప్రారంభించారు. అనంతరం పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అసాధారణ సంకల్పబలం, దూరదృష్టి, సమర్థవంతమైన నాయకత్వంతో 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.