ఆంధ్రప్రదేశ్
సరస్ మేళాకు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం
22-10-2026 09:29

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జరుగుతున్న జాతీయ సరస్ మేళా–2026కు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లను కోరారు. పున్నమి ఘాట్‌లో సోషల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా రీల్స్, వీడియోలు, బ్లాగులు రూపొందించి మేళా విశేషాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వివిధ రాష్ట్రాల హస్తకళలు, చేనేత వస్త్రాలు, సంప్రదాయ వంటకాలు వంటి ప్రత్యేక ఆకర్షణల గురించి విస్తృత ప్రచారం చేయాలని కోరారు.
xPress24, Vijayawada, October 22,