ఆంధ్రప్రదేశ్
సరస్ మేళాలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
26-10-2026 09:22

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా–2026లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రకృతి వ్యవసాయం, పోషకాహార కిచెన్ గార్డెన్లపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణ, పంటల సామర్థ్యం పెంపొందించే విధానాలను వివరించారు. ఇంటి ఆవరణలో కూరగాయలు పండించడం ద్వారా కుటుంబాలకు తాజా, పోషక విలువలున్న ఆహారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రుతుపవనాలకు ముందు విత్తనాలు నాటే పద్ధతితో నేలలో సూక్ష్మజీవ వ్యవస్థ, నేల నిర్మాణం మెరుగుపడి పంటలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.
xPress24, Vijayawada, October 26,