ఆంధ్రప్రదేశ్
సాలూరు మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్
24-10-2026 09:50

సాలూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
xPress24, Saluru, October 23,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 23:
సాలూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన పట్టణాభివృద్ధి, మున్సిపల్ సేవల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించడం, పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ప్రస్తుతం పార్వతీపురం సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సచిన్ అర్చిత్ రహార్, అదనంగా సాలూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు.