xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
ఆంధ్రప్రదేశ్

సాలూరులో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

29-10-2026 14:13
అర్నబ్ తుపాను ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని వేగావతి నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో పట్టణంలోని తొమ్మిదో వార్డు కొంకివీధిలోకి వరద నీరు చేరి పలు ఇళ్లు ముంపునకు గురయ్యాయి.
xPress24, Salur, October 29, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 29: అర్నబ్ తుపాను ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని వేగావతి నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో పట్టణంలోని తొమ్మిదో వార్డు కొంకివీధిలోకి వరద నీరు చేరి పలు ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గురువారం ముంపు ప్రాంతాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గృహోపకరణాలు తడిసి పాడయ్యాయని, రాత్రంతా నిద్రలేకుండా గడిపామని స్థానికులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా తనకు చెందిన పది పందులు కొట్టుకుపోయాయని బాధితుడు పాపారావు మంత్రికి వివరించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి సంధ్యారాణి, వరదల వల్ల జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన బాధితులకు నిబంధనల ప్రకారం పరిహారం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.