xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో రియల్టీ, బ్యాంకింగ్ షేర్లు

13-11-2026 09:35
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో రియల్టీ, బ్యాంకింగ్ షేర్లు
ఒడిదుడుకుల ట్రేడింగ్ అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 31 పాయింట్లు పెరిగి 81,911 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 25,299 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ ఇండెక్స్ 4 శాతం లాభపడగా, బ్యాంకింగ్, మిడ్-స్మాల్ క్యాప్ షేర్లు రాణించాయి. ఆటో రంగ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
xPress24, mumbai, November 12, దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. రియల్టీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించగా, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలకు అడ్డుకట్ట వేసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 31.61 పాయింట్లు లాభపడి 81,911.01 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 44.30 పాయింట్లు (0.18 శాతం) పెరిగి 25,299.35 వద్ద ముగిసింది. మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల జోరు.. 4 శాతం ఎగబాకిన రియల్టీ ఇండెక్స్ ప్రధాన సూచీలు ఫ్లాట్‌గా ముగిసినప్పటికీ విస్తృత మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.85 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.12 శాతం మేర లాభపడ్డాయి. రంగాలవారీగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4 శాతం ఎగబాకి అగ్రస్థానంలో నిలవగా, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, బ్యాంక్ సూచీలు రాణించాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ నష్టాలను చవిచూసింది. మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.