బిజినెస్
స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు
23-11-2026 15:43
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు సోమవారం నాడు దేశీయ బులియన్ మార్కెట్‌లో మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువతో పాటు సరఫరా వ్యవస్థలో మార్పులు, కొనుగోళ్లలో హెచ్చుతగ్గులు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
xPress24, Hyderabad, November 23,
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు సోమవారం నాడు దేశీయ బులియన్ మార్కెట్‌లో మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువతో పాటు సరఫరా వ్యవస్థలో మార్పులు, కొనుగోళ్లలో హెచ్చుతగ్గులు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో గత ట్రేడింగ్ సెషన్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,450గా ఉంది. సోమవారం నాటికి రూ.2,091 పెరిగి రూ.1,28,541కు చేరుకుంది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,650గా నమోదైంది.హైదరాబాద్‌లో గత సెషన్లో కిలో వెండి ధర రూ.1,53,111గా ఉండగా, సోమవారం నాటికి రూ.2,633 పెరిగి రూ.1,55,744కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ స్పాట్ సిల్వర్ ధర 41.51 డాలర్ల వద్ద ఉంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్‌లోనూ వెండి ధరలు మారుతున్నాయి.