xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

21-11-2026 16:02
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు
XPress24 Jangareddygudem 21-11-2026 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని, తాజాగా పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేశామని ఆయన వెల్లడించారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను తమ రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈవీఎం, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్.. ఎన్నికల విధానం ఏదైనా కూటమికే విజయం దక్కుతోందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి 3.6 శాతం ఓట్లు పెరిగాయని చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం, విద్యార్హతలు, పార్టీ పట్ల అంకితభావం, ప్రజల్లో ఆదరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయంతో పాటు క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల కృషి కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.