xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఅంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ

హెచ్‌ఐసీసీలో భారత్ సమిట్-2026 అండ్ తెలంగాణ రైజింగ్ సదస్సు ప్రారంభం

12-11-2026 11:46
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో మూడు రోజుల పాటు భారత్ సమిట్-2026 అండ్ తెలంగాణ రైజింగ్ సదస్సు ప్రారంభమైంది. ఫోర్జింగ్ ఏ న్యూ వరల్డ్ నినాదంతో జరిగే ఈ సదస్సులో పలువురు జాతీయ నేతలు, మంత్రులు, నిపుణులు పాల్గొననున్నారు.
xPress24, Hyderabad, November 12, ప్రపంచ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, నూతన ప్రపంచ క్రమంపై మేధోమథనం జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో భారత్ సమిట్-2026 అండ్ తెలంగాణ రైజింగ్ సదస్సు నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత స్వాతంత్ర్య 80వ వార్షికోత్సవం, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్కరించుకుని ఫోర్జింగ్ ఏ న్యూ వరల్డ్ నినాదంతో నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. తొలిరోజు వివిధ దేశాల ప్రతినిధులు రాష్ట్ర అసెంబ్లీ, ఉపాధి హామీ పనుల ప్రదేశాలను సందర్శించనున్నారు. రాత్రి జరిగే స్వాగత విందులో సల్మాన్ ఖుర్షీద్, శశి థరూర్, శ్యామ్ పిట్రోడా ప్రసంగించనున్నారు. రెండో రోజు ప్రముఖుల ప్రసంగాలు, సెషన్లు సదస్సులో రెండో రోజైన శుక్రవారం ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కీలకోపన్యాసం చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాతావరణ మార్పులు, సామాజిక న్యాయం, ఫ్యూచర్ సిటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ సెషన్లు కొనసాగనున్నాయి. మూడో రోజైన శనివారం సమాఖ్య వ్యవస్థ, ఎన్నికల సమగ్రత, ప్రపంచ శాంతిపై చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం జరిగే ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. తెలంగాణ రైజింగ్ సెషన్లు, పెట్టుబడులపై ప్రత్యేక సమావేశాలు హైటెక్స్ వేదికగా జరిగే తెలంగాణ రైజింగ్ సెషన్లలో ఫ్యూచర్ సిటీ, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలపై మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తదితరులు చర్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.