తెలంగాణ
‘హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్’ పాదయాత్ర
26-11-2026 12:01

మాదకద్రవ్య రహిత భారతదేశమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ‘హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్’ పాదయాత్రను బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచందర్‌రావు, సినీ నటులు వెంకటేశ్ తో కలిసి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, స్థానికులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. విదేశాల నుంచి అక్రమంగా మత్తు పదార్ధాల సరఫరా అవుతున్నాయని, డ్రగ్స్ తయారీ, సరఫరా, విక్రయాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
xPress24, Hyderabad, November 26,