తెలంగాణ
హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నేడు, రేపు భారత్ సమిట్ 2.O
13-11-2026 11:59
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో 'భారత్ సమ్మిట్ 2.0' అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమాల్లో భాగంగా ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
xPress24, Hyderabad, November 13,
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో 'భారత్ సమ్మిట్ 2.0' అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమాల్లో భాగంగా ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే వెయ్యి మందికి పైగా విదేశీ ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో కాంగ్రెస్ నేతలు వీరికి ఘన స్వాగతం పలికారు. కొత్త ప్రపంచ వ్యవస్థను భారత్ ఎలా చూస్తోంది అనే ప్రధానాంశంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ వేదికపై కృత్రిమ మేధ, క్లౌడ్ క్యాపిటలిజం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పాత్ర వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. మొత్తం 8 ప్యానెల్ చర్చలు, ఒక ప్రత్యేక ప్లీనరీని నిర్వహించనున్నారు.ముఖ్యంగా 'తెలంగాణ రైజింగ్' పేరుతో ప్రత్యేక చర్చ చేపట్టనుండగా.. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు, ఫ్యూచర్ సిటీ, ఆర్థిక న్యాయంపై చర్చించనున్నారు. అలాగే సంక్షేమ విధానాలు, యువత, క్రీడలు, సంస్కృతి, ఎన్నికల సమగ్రత వంటి అంశాలపై వివిధ దేశాలకు చెందిన రాజకీయ నేతలు, ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.