తెలంగాణ
హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
21-11-2026 11:59
హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సచివాలయంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ఆయన, నిమ్స్, టిమ్స్ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ వైద్య పర్యాటకుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్యులకు జాయింట్ రీప్లేస్‌మెంట్, న్యూరో, కార్డియో సర్జరీల్లో ప్రైవేటు వైద్యులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
xPress24, hyderabd, November 21,
ఆరోగ్య రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. సచివాలయంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగాల సమన్వయంపై వైద్య నిపుణులతో చర్చించారు. సనత్‌నగర్ టిమ్స్, నిమ్స్, అల్వాల్, కొత్తపేట టిమ్స్ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ వైద్య పర్యాటకుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వ వైద్యులకు ఉచిత సర్జరీ శిక్షణ.. ప్రతి జిల్లాలో కీమోథెరపీ కేంద్రాలు
ప్రభుత్వ వైద్యులకు జాయింట్ రీప్లేస్‌మెంట్, న్యూరో, కార్డియో థొరాసిక్ సర్జరీల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేటు వైద్యులు ముందుకొచ్చారని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేటు వైద్య నిపుణుల సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. ప్రతి జిల్లాలో కీమోథెరపీ కేంద్రాల ఏర్పాటు, డయాలసిస్ సేవల విస్తరణపై వైద్య నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Bytes:
దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి